తెలంగాణ

telangana

ETV Bharat / city

పక్కా వ్యూహంతోనే గ్రీన్​జోన్​లోకి వెళుతున్నాం: కలెక్టర్​ - corona cases in nizamabad

పక్కా వ్యూహాలు, ఇంటింటి సర్వే, క్వారంటైన్​ను కచ్చితంగా అమలయ్యేలా చూడడం ఫలితంగా నిజామాబాద్​లో కరోనా వైరస్​ వ్యాప్తికి అధికార యంత్రాంగం అడ్డుకట్ట వేసింది. త్వరలోనే గ్రీన్​జోన్​ జాబితాలోకి మారనుంది.

nizamabad collector narayana reddy
ప్రత్యేక చర్యలే కరోనాను కట్టడి చేశాయి: కలెక్టర్​

By

Published : May 8, 2020, 5:26 PM IST

నిజామాబాద్​లో అధికంగా కరోనా కేసులు నమోదుకావడం వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వివిధ శాఖల సమన్వయంతో వైరస్​ వ్యాప్తిని కట్టడి చేసింది యంత్రాంగం. లాక్​డౌన్ నిబంధనలు పక్కాగా అమలు చేస్తూనే చేపట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. ఇంటింటి సర్వే, ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులు గుర్తించి పరీక్షలు నిర్వహించడం, రెడ్​జోన్​లను నో మూమెంట్ జోన్​గా మార్చడం, క్వారంటైన్ కచ్చితంగా అమలయ్యేలా చూడడం ఫలితంగా వైరస్​ సామాజిక వ్యాప్తి చెందకుండా నియంత్రించారు.

జిల్లాలో మొత్తం 61 కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 53 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 8 మంది త్వరలోనే ఇంటికి వెళ్లనున్నారు. నిజామాబాద్ జిల్లాలో కరోనా కట్టడిలో విజయం సాధించామని.. ప్రజలు సంపూర్ణంగా సహకరించారని.. త్వరలోనే గ్రీన్​జోన్​లోకి మారుతుందని చెబుతోన్న కలెక్టర్ నారాయణరెడ్డితో ఈటీవీ భారత్​ ప్రతినిధి శ్రీశైలం ముఖాముఖి..

ప్రత్యేక చర్యలే కరోనాను కట్టడి చేశాయి: కలెక్టర్​

ఇవీచూడండి:యాంటీ బాడీస్​ తయారీకి భారత్​ బయోటెక్​కు అనుమతి

ABOUT THE AUTHOR

...view details