నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ గ్రామంలో తలారి సత్తెమ్మ అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. నాలుగురోజుల క్రితం ఆమె కుమారునికి కరోనా సోకడం వల్ల అధికారులు అతన్ని హోంక్వారంటైన్ చేశారు. అతని భార్య, కుమారులు, తండ్రికి కరోనా పరీక్షల్లో నెగిటివ్ అని తేలింది. ఆ వ్యక్తి తల్లి సత్తెమ్మ కరోనా నిర్ధరణ పరీక్ష రిపోర్టు రాకముందే మృతి చెందింది. గ్రామస్థులంతా ఆ మహిళకు కూడా కరోనా సోకిందనే అనుమానంతో అంత్యక్రియలు జరపడానికి ముందుకు రాలేదు.
కడసారి వీడ్కోలు చెప్పే వీలు లేకుండా చేసిన కరోనా - corona effect on women's funeral
కుమారుడికి కరోనా సోకడం వల్ల కుటుంబమంతా హోంక్వారంటైన్లో ఉంది. ఇదే సమయంలో మృతి చెందిన మహిళ కరోనాతో మరణించిందేమోనన్న అనుమానంతో అంత్యక్రియలు జరపడానికి ముందుకు రాలేదు. తమ కళ్ల ముందే మున్సిపల్ సిబ్బంది ఆమె మృతదేహాన్ని జేసీబీ సాయంతో తీసుకెళ్లడం చూసి పగవారికి కూడా ఈ పరిస్థితి రావొద్దంటూ విలపించారు. మనసుల్ని కలిచివేస్తున్న ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ గ్రామంలో చోటుచేసుకుంది.
గోవింద్‌పేట్‌లో జేసీబీ సాయంతో మహిళ అంత్యక్రియలు
మున్సిపల్ సిబ్బంది జేసీబీ సాయంతో సత్తెమ్మ మృతదేహాన్ని శశ్మానవాటికలో పూడ్చి పెట్టారు. ఇన్నేళ్లు తమ మధ్యలోనే ఎంతో ఆప్యాయంగా ఉన్న సత్తెమ్మకు కడసారి వీడ్కోలు పలికే అవకాశం లేకుండా పోయిందని గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. ఇలాంటి ఆపద పగవారికి కూడా రావొద్దంటూ విలపించారు.
- ఇదీ చూడండి:'ఆరు నెలల్లో 175 వాయు నాణ్యత కేంద్రాలు!'
TAGGED:
కరోనా కర్కశత్వం