దేశంలో పంటల బీమా లేని ఏకైక రాష్ట్రం... తెలంగాణ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ శంకర్‌నాయక్‌తోపాటు కాంగ్రెస్ శ్రేణులతో కలెక్టరేట్‌కు వెళ్లి రైతుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చారు.
'సీఎం నిర్లక్ష్యం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు' - టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వినతిపత్రం
రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ... నల్గొండ కలెక్టర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వినతిపత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఉత్తమ్ విమర్శించారు.
tpcc chief uttam kumar reddy gave letter to nalgonda collector
గత నెలలో కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల ఎకరాల్లో పంటలు కోల్పోయినా... పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సన్నాలు సాగు చేయాలని ముఖ్యమంత్రి చెప్పడం వల్లే పెద్దఎత్తున పంటలు వేశారన్న ఉత్తమ్... సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే మద్దతు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు.
ఇదీ చూడండి: అప్పటివరకు పంపిణీ చేయవద్దు: హైకోర్టు
TAGGED:
nalgonda latest news