నాగార్జునసాగర్ ఉపఎన్నికలో జానారెడ్డి గెలిస్తే కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ఏడుకు పెరుగుతుందే తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలోనే జానారెడ్డి ఊర్లోకి వస్తారని విమర్శించారు. అనుముల మండలం పాలెం గ్రామానికి ప్రచారానికి వచ్చిన మంత్రులకు మహిళలు బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు.
జానారెడ్డి గెలిస్తే ప్రజలకు ఒరిగేదేమీలేదు: మంత్రులు
జానారెడ్డి గెలిస్తే ప్రజలకు ఒరిగేదేమి లేదని.. కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ఏడుకు చేరుతుందని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్ ఎద్దేవా చేశారు. తెరాస అభ్యర్థి నోముల భగత్‌ను గెలిపిస్తేనే నాగార్జునసాగర్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో తెరాస ప్రచారం
కాంగ్రెస్ హయాంలో సాగర్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మంత్రులు విమర్శించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారం చేయకుండా ఇంట్లోనే కూర్చుని గెలుద్దామంటూ గతంలో జానారెడ్డి విసిరిన సవాల్‌పై కౌంటర్లు వేశారు. నోముల భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.