నరసింహునికి అష్టోత్తర శత ఘటాభిషేకం - యాదాద్రి పూజలు
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి అష్టోత్తర శత ఘటాభిషేకం పూజలు నిర్వహించారు. స్వామి వారి స్వాతి జన్మ నక్షత్రం పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. లాక్‌డౌన్ నిబంధనల వల్ల భక్తులకు అనుమతి ఇవ్వలేదు. కేవలం ఆలయ అర్చకులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న భక్తులకు అభిషేకాలు, గోత్రనామాలతో పూజలు జరుపుతున్నారు.
శత ఘటాభిషేకం