Rajagopalreddy Fires on Revanthreddy: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రావాలనే రాజీనామా చేశానని భాజపా నేత రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో కుటుంబ పాలనను బొందపెట్టాలనే.. ఇప్పుడున్న పరిస్థితులలో అది భాజపాతోనే సాధ్యమని భాజపాలో చేరానని తెలిపారు. రేవంత్ రెడ్డిని నమ్మి కాంగ్రెస్ నట్టేట మునగడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. నల్గొండ జిల్లా గట్టుప్పల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం వచ్చిన ఎన్నిక.. రాజగోపాల్‌రెడ్డి కోసం వచ్చిన ఎన్నిక కాదన్నారు. ఇది ఒక యజ్ఞం.. ఒక ధర్మయుద్ధం అని ఆయన పేర్కొన్నారు. డబ్బు సంచులతో తెరాస రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. మునుగోడులో ఈసారి గెలిచేది ప్రజలే అని పేర్కొన్నారు. మునుగోడు ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో డబ్బుకు అమ్ముడుపోరన్నారు.
రేవంత్ రెడ్డిని నమ్మి కాంగ్రెస్ నట్టేట మునగడం ఖాయం: రాజగోపాల్ రెడ్డి - రేవంత్‌పై రాజగోపాల్‌రెడ్డి పైర్
Rajagopalreddy Fires on Revanthreddy: రేవంత్‌రెడ్డి రాజకీయాల్లోకి రాక ముందు చోరీలు చేసేవారని భాజపా నేత రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. డబ్బు సంచులతో తెరాస రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో కుటుంబ పాలన పోయి.. ప్రజాస్వామ్య పాలన రావాలనే రాజీనామా చేసి భాజపాలో చేరానన్నారు. ఇది మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం వచ్చిన ఎన్నిక అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
Rajagopalreddy
'రాష్ట్రంలో కుటుంబ పాలనను బొందపెట్టాలి. రేవంత్‌రెడ్డికి చరిత్ర లేదు. రేవంత్‌రెడ్డి రాజకీయాల్లోకి రాక ముందు చోరీలు చేసేవారు. రేవంత్‌రెడ్డి.. ఇప్పటికీ చంద్రబాబు డైరెక్షన్‌లో పనిచేస్తున్నారు. కాంగ్రెస్‌లో ముందు రేవంత్‌రెడ్డి ఫోటో... వెనకాల చంద్రబాబు ఫోటో. నేను రాజకీయాల్లోకి వచ్చాక... సొంత ఆస్తులు అమ్ముకున్నా. డబ్బుకోసం అమ్ముడుపోయిన వ్యక్తి ఎవరో ప్రజలకి తెలుసు.'-రాజగోపాల్‌రెడ్డి, భాజపా నేత
ఇవీ చదవండి:
Last Updated : Sep 4, 2022, 5:57 PM IST