హాలియాలో కేసీఆర్ పర్యటన.. భాజపా నేతల ముందస్తు అరెస్టు - nagarjunasagar by election 2021
07:31 February 10
సీఎం పర్యటన నేపథ్యంలో అరెస్టుల పర్వం
నల్గొండజిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో నేడు సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనున్నందున అప్రమత్తమైన పోలీసులు భాజపా నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి సభను అడ్డుకుంటామని చెప్పిన భాజపా జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డిని పెద్దవూర మండలం పులిచర్లలో గృహనిర్బంధంలో ఉంచారు.
సాగర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో భాజపా కార్యకర్తలు, నాయకులను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు, హుజూర్‌నగర్‌లోని మఠంపల్లి మండలంలో కాషాయ నేతల తీరుతో ముఖ్యమంత్రి సభకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉన్నారు.