నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజపేట తండాలో అటవీ అధికారులు బంధించిన చిరుత మృతి చెందింది. పొలాల్లో రైతులు వేసిన వలలో చిక్కుకున్న చిరుతను హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శన శాల, అటవీ అధికారులు మత్తు మందు ఇచ్చి బంధించారు. చిరుతను హైదరాబాద్ తీసుకొచ్చే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందినట్లు జంతు ప్రదర్శనశాల క్యూరేటర్ క్షితిజ తెలిపారు. మృతి చెందిన చిరుతకు పశువైద్యాధికారులు పోస్టుమార్టం నిర్వహించారు.
రాజపేట తండాలో కలకలం సృష్టించిన చిరుత మృతి
17:58 May 28
రాజపేట తండాలో కలకలం సృష్టించిన చిరుత మృతి
రైతులు వేసిన వల నుంచి తప్పించుకునే క్రమంలో చిరుతకు గాయాలయ్యాయని వెల్లడించారు. కాళ్లు, నోరుతో పాటు శరీరం లోపల కూడా గాయాలను గుర్తించామన్నారు. బంధించే సమయంలో షాక్‌కు గురైందని, ఆక్సిజన్ కూడా పూర్తిస్థాయిలో అందకపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. పోస్టుమార్టంలో చిరుత శరీరంలో కొన్ని భాగాలను సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. చనిపోయిన చిరుత ఏడేళ్ల వయసుండొచ్చన్నారు.
ఇవీ చూడండి:లైవ్ వీడియో: ముళ్లకంచెలో చిరుత... ఎట్టకేలకు చిక్కిందిలా