యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపును నిర్వహించారు. గడిచిన 29 రోజుల హుండీ ఆదాయం రూ. 65,14,355 నగదు, 27 గ్రాముల బంగారం, 2.25 కిలోల వెండి ఆలయ ఖజానాకు సమకూరినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి గీతారెడ్డి వెల్లడించారు.
యాదాద్రి: 29 రోజుల్లో రూ. 65 లక్షల హుండీ ఆదాయం - yadadri hundi counting news
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు గురువారం నిర్వహించారు. 29 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ సిబ్బంది లెక్కించారు.
యాదాద్రి: 29 రోజుల్లో రూ. 65 లక్షల హుండీ ఆదాయం
హుండీ లెక్కింపులో పాల్గొన్న ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ చేతులకు గ్లౌజులు ధరించినట్లు గీతారెడ్డి ప్రకటించారు. హుండీ లెక్కింపు కార్యక్రమం ఆలయ అధికారుల పర్యవేక్షణలో జరిగిందని వివరించారు.
ఇదీ చదవండిఃయాదాద్రీశుని దర్శించుకున్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్