యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీంచారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పనుల సాగుతున్న తీరును వైటీడీఏ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
యాదాద్రి ఆలయ పనులను పరిశీలించిన సీఎంవో కార్యదర్శి - యాదాద్రి ఆలయ పనులు
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
యాదాద్రి ఆలయ పనులను పరిశీలించిన సీఎంవో కార్యదర్శి
ప్రధానాలయం, గర్భాలయం, ముఖమండపం, బ్రహ్మోత్సవ మండపం వద్ద జరుగుతున్న ఫ్లోరింగు పనులను క్షేతస్థాయిలో పరిశీలించారు. కొండపైన నిర్మితమవుతున్న శివాలయం పనులు, సాలాహారాల్లో పొందుపరుస్తున్న విగ్రహాల పొందిక తీరును, స్టోన్ కలర్ పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు.