తెలంగాణ

telangana

ETV Bharat / city

ఓ మంచి సబ్​రిజిస్ట్రార్​! - SUB-REGISTRAR

భూముల రిజిస్ట్రేషన్​ జరగాలంటే... సిబ్బంది చేతులు తడపాలనే అభిప్రాయం జనాల్లో గట్టిగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం దానికి విరుద్ధం. ఎంత అంటే... ఏ పని ఎంత సమయంలో చేస్తారనేది కూడా సూచికలు పెట్టి మరీ చెప్పేంత పారదర్శకం.

ఓ మంచి సబ్​రిజిస్ట్రార్​!

By

Published : Feb 27, 2019, 7:56 AM IST

ఓ మంచి సబ్​రిజిస్ట్రార్​!

భూమి రిజిస్ట్రేషన్​ జరగాలంటే... ఏదో ఓ స్థాయిలో కాసులు కురిపించక తప్పని పరిస్థితి. కానీ నిత్యం 80కి పైగా రిజిస్ట్రేషన్లు జరిగే మంచిర్యాల సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయం మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. ఇక్కడ ప్రతిదీ పద్ధతి ప్రకారం జరగాల్సిందే. పని కోసం తరచూ కార్యాలయం చుట్టూ తిరగనవసరం లేదు. ప్రత్యేక సూచికలను ఏర్పాటుచేసి మరీ.. స్థానికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు.
సిబ్బందిలోనూ చైతన్యం నింపారు..!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించని ప్రత్యేకతలు ఇక్కడ అమలు కావడానికి కారణం సబ్ రిజిస్ట్రార్​ కొనకంచి రాంబాబే అంటున్నారు సిబ్బంది. 2014 నవంబర్​లో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వినూత్న ఆలోచనలు చేస్తూ... తమలోనూ ప్రత్యేక చైతన్యం నింపారని కితాబిస్తున్నారు.
సంతృప్తిగా ఉంది..!
ఆంగ్లంలోనే కనిపించే చట్టాల వల్ల సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఆయన..భారత స్టాంపు చట్టం అనే పుస్తకాన్ని తెలుగులో రచించారు. తన పుస్తకం వల్ల చాలా మంది సందేహాలు తీరుతున్నాయని ​​ రాంబాబు హర్షం వ్యక్తం చేశారు. సామాన్యులకు బాధ్యతగా సేవలందిస్తున్నందుకు సంతృప్తిగా ఉందన్నారు.
వివాదాలకు పరిష్కారాలు కూడా..!
ఉద్యోగంతో పాటు ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్తూ... ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు రాంబాబు. కార్యాలయంలో సౌకర్యాలు కల్పించటమే కాదు పలు వివాదాలకు పరిష్కారాలు కూడా అందిస్తూ... సాయపడుతున్నారు ఈ మంచి సబ్​ రిజిస్ట్రార్​.

ABOUT THE AUTHOR

...view details