తెలంగాణ

telangana

ETV Bharat / city

గేటు పడిందా... అరగంట ఆగాల్సిందే..!

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర రైల్వే గేట్ అంటేనే వాహనదారులు భయపడే పరిస్థితి నెలకొంది. గేట్ పడింది అంటే చాలు గేటు ఇరువైపులా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోవాల్సిందే. బుధవారం సంతరోజు రైల్వే క్రాసింగ్ పడి, ఇంకా ఏవైనా శుభకార్యాలు ఉంటే పరిస్థితి మరింత దారుణం.

గేటు పడిందా... అరగంట ఆగాల్సిందే..!

By

Published : May 16, 2019, 12:18 PM IST

గేటు పడిందా... అరగంట ఆగాల్సిందే..!

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి దేవరకద్ర మీదుగా కర్ణాటక రాష్ట్రాన్ని అనుసంధానం చేస్తూ 167వ జాతీయ రహదారిని నిర్మించారు. కాచిగూడ నుంచి కర్నూలు వెళ్లే రైళ్లన్నీ దేవరకద్ర మీదుగానే వెళ్తుంటాయి. నిత్యం సగటున 50 రైళ్లు ఈ మార్గాన రాకపోకలు నిర్వహిస్తుంటాయి. రైలొచ్చే సమయంలో జాతీయ రహదారిపై పైవంతెన లేకపోవడంతో గేటు ద్వారా నియంత్రిస్తుంటారు.

ప్రతీ బుధవారం ఇక్కడ సంత జరుగుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వరుసగా గంట వ్యవధిలోనే 4 రైళ్ల రాకపోకలు కొనసాగాయి. గేటును మళ్లీమళ్లీ వేయడం, సంత, దీనికి తోడు శుభకార్యాలు తోడైనందున వాహనాల రద్దీ పెరిగింది. దానికి తోడు తీవ్రమైన ఎండ. ప్రయాణికులకు నరకం చూపించింది. బస్సుల్లో ప్రైవేటు వాహనాల్లో వచ్చే ప్రయాణీకులు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. ఒక వాహనం గేటు దాటేందుకు 15 నుంచి 40 నిమిషాల సమయం పట్టింది. అధికారులు ఈ సమస్యను గతంలోనే గుర్తించి ఆర్​ఓబీ నిర్మాణంపై దృష్టిపెట్టారు. అది అయ్యేవరకు గేటుకు ఇరువైపులా నీడను ఏర్పాటు చేసి వాహన దారుల దాహం తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

వీలైనంత త్వరగా ఆర్​ఓబీని ఏర్పాటు చేస్తే సమస్య తీరుతుంది. అధికారులు ఇప్పటికైనా ఈ నిర్మాణంపై దృష్టిపెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: 'ఫొని' దెబ్బతీసింది- మంచితనం ఆదుకుంది

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details