తెలంగాణ

telangana

ETV Bharat / city

నిర్లక్ష్యమే ప్రతికూల ప్రభావాలకు కారణం : డాక్టర్ రాంకిషన్ - doctor ram kishan

కరోనా మహమ్మారి కోరలు చాచినప్పటి నుంచి చాపకింద నీరులా రెండో దశ విజృంభణ వరకు మహబూబ్​నగర్ జిల్లా ఆస్పత్రి సారధిగా ముందుండి నడిపించారు సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్. ఆస్పత్రిలో ఏడాదిన్నర కాలంలో 12వేల మంది చికిత్స పొందగా.. ఇక్కడి మరణాల రేటు 0.50 శాతం మాత్రమే. ప్రస్తుత కరోనా తీరు, లక్షణాలు, చికిత్స, వసతులు వంటి తదితర అంశాలను ఆయన ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

doctor ramkishan, doctor ramkishan in mahabubnagar
డాక్టర్ రాంకిషన్, సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్

By

Published : May 14, 2021, 1:04 PM IST

మహబూబ్​నగర్ జిల్లా ఆస్పత్రిలో ఏడాదిన్నర కాలంలో... సుమారు 12వేల మంది కొవిడ్​కు చికిత్స పొందారు. అక్కడి మరణాల రేటు కేవలం 0.50 శాతం. ఆసుపత్రిలో చేరిన వారిలో 99.5 శాతం మంది కోలుకున్నవారే. కరోనా జడలు విప్పిన తొలినాళ్ల నుంచి ఇప్పటి సెకండ్ వేవ్ వరకూ జిల్లాఆసుపత్రి సారధిగా ముందుండి నడిపించారు.. సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్.

రెండుసార్లు కరోనా బారినపడి, కోలుకుని, తిరిగి విధుల్లో చేరి తన సేవలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కోవిడ్ కేసుల తీరు, లక్షణాలు, చికిత్స సహా కరోనాపై పోరాటంలో తన అనుభవాలను మనతో పంచుకున్నారు. కరోనా పట్ల ప్రజల్లో ఉన్న నిర్లక్ష్యమే అనేక ప్రతికూల ప్రభావాలకు కారణమవుతోందంటున్న... డాక్టర్ రాంకిషన్ తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

మహబూబ్​నగర్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్

ABOUT THE AUTHOR

...view details