వనపర్తి జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో మంత్రి 104 మొక్కలు నాటారు. జిల్లాలో కోటి 20 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని.. ఇప్పటి వరకు 15 లక్షల మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు. స్వచ్ఛ వనపర్తి కార్యక్రమంలో పాల్గొని ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి.. కాగితం, బట్టలతో కుట్టిన వాటిని వాడాలని సూచించారు. ఇందుకు కావలసిన ఆర్థిక వనరులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ప్లాస్టిక్ నిషేధించి... స్వచ్ఛ వనపర్తిని తయారు చేద్దాం.. - మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. జిల్లాలో కోటి 20 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.
ప్లాస్టిక్ నిషేదించి... స్వచ్ఛ వనపర్తిని తయారు చేద్దాం..