పొలం పనులకు వెళ్లి.. ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు మృతిచెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. బూర్గంపాడు మండలం లక్ష్మీపురానికి చెందిన కృష్ణయ్య అతని కుమారుడు, మనవళ్లతో కలిసి పొలం పనులకు వెళ్లాడు. పని పూర్తయ్యాక చేతులు, కాళ్లు కడుక్కునేందుకు చెరువు వద్దకు వచ్చారు.
లక్ష్మీపురంలో విషాదం.. కుటుంబాన్ని మింగేసిన చెరువు - Three killed in drowning
పొలం పని పూర్తి చేసుకుని.. కాళ్లు, చేతులు కడుకుందామని వెళ్లిన ఆ కుటుంబాన్ని చెరువు మింగేసింది. ముగ్గురు మృతి చెందాగా, ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ప్రాణం తీసిన ఈత సరదా.. ముగ్గురు మృతి
ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి.. కృష్ణయ్య కుమారుడు అప్పారావు(35), మనవళ్లు తేజ(20), వినయ్(20) చనిపోయారు. కృష్ణయ్య ప్రాణాలతో బయటపడ్డాడు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చూడండి:'ఎల్‌ఆర్‌ఎస్‌కు గడువు పొడిగించండి'
Last Updated : May 19, 2020, 11:53 AM IST