తెలంగాణ

telangana

ETV Bharat / city

ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో ప్రత్యేక టెస్టింగ్​ ట్రాక్​

హైదరాబాద్​తో సమానంగా ఖమ్మం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి పువ్వాడ హామీ ఇచ్చారు. ఖమ్మం ఆర్టీవో కార్యాలయంలో ఆరో విడత హరిత హారంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు.

By

Published : Jul 6, 2020, 1:20 PM IST

Updated : Jul 6, 2020, 2:50 PM IST

puvvada ajay
ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో ప్రత్యేక టెస్టింగ్​ ట్రాక్​: పువ్వాడ

జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున హరితహారం లక్ష్యం నెరవేరేలా అధికారులు కృషిచేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సూచించారు. ఖమ్మం ఆర్టీవో కార్యాలయంలో ఆరో విడత హరిత హారంలో భాగంగా మొక్కలు మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో కలియ తిరిగారు.

హైదరాబాద్​తో సమానంగా ఖమ్మం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రత్యేక టెస్టింగ్​ ట్రాక్​ను ఏర్పాటుచేస్తామని తెలిపారు. సిమిలేటర్ ద్వారా డ్రైవింగ్‌ అనుభవం వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నటు వివరించారు. జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులందరూ హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో ప్రత్యేక టెస్టింగ్​ ట్రాక్​

ఇవీచూడండి:భయం భయం: ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా వణుకు

Last Updated : Jul 6, 2020, 2:50 PM IST

ABOUT THE AUTHOR

...view details