ఖమ్మంలో జూన్ రెండు నుంచి తొమ్మిది వరకు పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్వీకర్ణన్ తెలిపారు. హైదరాబాద్ బుక్ ఫేయిర్ ఆధ్వర్యంలో, సుమారు 50 పుస్తక ప్రచురణ సంస్థలు తమ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. పెవిలియన్ మైదానంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పుస్తక ప్రదర్శన ఉంటుందని తెలిపారు. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈసారి లక్కీ డ్రా నిర్వహించి పుస్తకాలను బహుమతులుగా ఇస్తామన్నారు. జ్ఞాన తెలంగాణ సాధనలో భాగంగా గ్రామా స్థాయిలో కూడా ప్రజలకు పుస్తక పఠనాన్ని పరిచయం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.
పుస్తక ప్రదర్శనకు వేదిక కానున్న ఖమ్మం - book fair start on june 2nd on words at khammam
పుస్తక ప్రదర్శనకు ఖమ్మం వేదిక కానుంది. జూన్ రెండు నుండి వారం రోజుల పాటు పదర్శన నిర్వహించనున్నారు. సుమారు 50 ప్రచురణ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి.
పుస్తక ప్రదర్శనకు వేదిక కానున్న ఖమ్మం
TAGGED:
books