తెలంగాణ

telangana

ETV Bharat / city

vaccine registration: గ్రామీణ ప్రజల సౌకర్యార్థం తపాలశాఖ చర్యలు - karimnagar latest news

గ్రామీణ ప్రజలు టీకా రిజిస్ట్రేషన్‌ కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు తపాలాశాఖ చర్యలు చేపట్టింది. పట్టణాలు నగరాల్లో అంతర్జాల సౌకర్యం... అక్షరాస్యులు ఉన్న కారణంగా ఇబ్బందులు లేకపోయినప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరో రకంగా ఉంది. దీనితో కేంద్ర ప్రభుత్వం తపాలా కార్యాలయాల్లో టీకా నమోదు ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది. ఇందుకోసం సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తున్నట్లు కరీంనగర్‌ పోస్టల్ సూపరింటెండెంట్‌‌ సత్తయ్య తెలిపారు. లబ్దిదారులు పోస్టాఫీస్ పనివేళల్లో ఆధార్‌ కార్డు, ఫోన్‌తో వస్తే ఉచితంగా రిజిస్ట్రేషన్‌ పూర్తి చేస్తామంటున్న పోస్టల్ సూపరింటెండెంట్‌ సత్యయ్యతో మా ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి.

vaccine registration in post office karimnagar
vaccine registration in post office karimnagar

By

Published : Jun 2, 2021, 5:45 PM IST

గ్రామీణ ప్రజల సౌకర్యార్థం తపాలశాఖ చర్యలు

"గ్రామీణ ప్రజలు టీకా రిజిస్ట్రేషన్‌ కోసం తపాలాశాఖ చర్యలు చేపట్టింది. నిరక్షరాస్యులు అధికంగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తపాలా కార్యాలయాల్లో టీకా నమోదు ప్రక్రియకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. టీకా రిజిస్ట్రేషన్‌ కోసం తపాలా సిబ్బందికి శిక్షణ కొనసాగుతోంది. ఆధార్‌ కార్డు, ఫోన్‌తో వస్తే ఉచితంగా తపాలా కార్యాలయంలో టీకా రిజిస్ట్రేషన్‌ చేస్తారు. లబ్దిదారులు పోస్టాఫీస్ పనివేళల్లో రావాలి." - కరీంనగర్‌ పోస్టల్ సూపరింటెండెంట్‌‌ సత్తయ్య

ఇదీ చూడండి: ఆస్పత్రిలో కరోనా రోగి మృతి- వైద్యుడిపై బంధువుల దాడి

ABOUT THE AUTHOR

...view details