Ideal Officers : సాధారణంగా ఏ అధికారులైనా కార్యాలయానికి వచ్చామా మన పని ఏంటో చూసుకున్నామా.. సాయంత్రం విధులు ముగించుకుని వెళ్లామా అనుకుంటారు. కానీ ఈ అధికారులు తమ విధులు, చేసే పనుల్లో ప్రత్యేకత చూపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరిలో ఒకరు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఆర్డీవో, ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్(స్థానికసంస్థలు) వినోద్‌కుమార్. ఈయన మెట్‌పల్లి బల్దియా పరిధిలో నిత్యం తెల్లవారుజామున సైకిల్‌పై తిరుగుతూ బల్దియా సేవలపై ఆరా తీస్తున్నారు. ఏదైనా సమస్య చెబితే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారమయ్యేలా కృషిచేస్తున్నారు. రహదారులతో పాటు వార్డుల్లో పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడుతూ విధుల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. కొన్ని రోజులుగా ఆర్డీవో సైకిల్‌పై వీధులు తిరుగుతూ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుండడంతో పట్టణవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పనుల్లో ప్రత్యేకత చూపిస్తూ.. ఆదర్శ పథంలో అధికారులు..
ఈ అధికారులు తమ విధులు, చేసే పనుల్లో ప్రత్యేకత చూపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరిలో ఒకరు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఆర్డీవో, ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్(స్థానికసంస్థలు) వినోద్‌కుమార్. అదే విధంగా కరీంనగర్ కలెక్టర్ దంపతులు తమ పిల్లలను జిల్లా కేంద్రంలోని బాలభవన్కి పంపుతూ అందరికీ ఆదర్శమవుతున్నారు.
ఆదర్శంగా నిలుస్తున్న కలెక్టర్ దంపతులు..కరీంనగర్ కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, ప్రియాంక (జడ్పీ సీఈవో) దంపతులు తమ పిల్లల(చిత్రంలో ఎడమవైపు పసుపు రంగు చొక్కాలో ఉన్నవారు)ను జిల్లా కేంద్రంలోని బాలభవన్‌లో ఏర్పాటు చేసిన వేసవి ఉచిత శిక్షణ శిబిరానికి పంపుతున్నారు. ఇక్కడ చిన్నారులకు చిత్రలేఖనం, గాత్ర సంగీతం, మృదంగం, క్రాఫ్ట్, నృత్యం నేర్పుతున్నారు. డబ్బులు వెచ్చించి ప్రత్యేక శిక్షణ ఇప్పించేస్థాయి ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగే శిక్షణ శిబిరానికి పంపిస్తూ కలెక్టర్ దంపతులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇదీ చదవండి: