కరీంనగర్ జిల్లాలో శాతవాహన యూనివర్సిటీ ఏర్పడి ఎన్నో ఏళ్లు గడిచినప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శనిగారపు రజినీ మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాలో నలుగురు మంత్రులు ఉన్నా అసెంబ్లీ సమావేశాల్లో వర్సిటీకి రెగ్యులర్ వీసీని నియమించాలని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో వర్సిటీకి రెగ్యులర్ వీసీ నియమించాలని అధిక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
బ్యాంక్ ఏర్పాటు చేయాలి..
యూనివర్సిటీకి విద్యార్థులు వెళ్లాలంటే బస్సు సౌకర్యం కూడా లేదన్నారు. విద్యార్థులు డీడీ తీయాలంటే వర్సిటీ సమీపంలో బ్యాంక్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. యూనివర్సిటీలో ఉన్న సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు. వర్సిటీలోని సమస్యలను పరిష్కరించాలటే శాశ్వాత ఉపకులపతి తప్పకుండా ఉండాలన్నారు. ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాలని స్పష్టం చేశారు. తక్షణమే యూనివర్సిటీ సమస్యలను పరిష్కరించాలన్నారు.