విభజన హామీలనుతెరాససాధించలేకపోయిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ విమర్శించారు. తెరాస ఎంపీలు ఏం సాధించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గులాబీ పార్టీ భాజపాకు మిత్రపక్షంగా వ్యవహరించిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ మధ్యేనని స్పష్టం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు.
ఏం సాధించారు ?
లోక్సభలో 15 మంది ఎంపీలున్నా రాష్ట్రం కోసం తెరాస సాధించింది శూన్యమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ విమర్శించారు.
మాట్లాడుతున్న పొన్నం