Attack on MP Arvind Convoy: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు చేదు అనుభవం ఎదురైంది. గోదావరి ముంపును పరిశీలించడానికి వెళ్లిన ఎంపీని గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామనికి సంబంధించిన భూ వివాదం పరిష్కరించకుండా ఎందుకు వచ్చారంటూ ఆయన్ను నిలదీశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు గ్రామస్థులను పక్కకు తప్పించగా.. ఎంపీ అర్వింద్ గోదావరి ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లారు.
జగిత్యాల జిల్లాలో భాజపా ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌పై దాడి
Attack on MP Arvind Convoy: వరద ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కారుపై దాడి చేసిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామ పర్యటనకు వచ్చిన ఎంపీ ధర్మపురి అరవింద్ వాహనాన్ని పలువురు గ్రామస్తులతో పాటు తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో భాజపా, తెరాస కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది.
Attack on MP Arvind
మరోవైపు ఆ సమయంలో తమపై భాజపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని గ్రామస్థులు ఆరోపించారు. దీంతో తిరుగు పయనమైన అర్వింద్‌ను మరోసారి వారు అడ్డుకున్నారు. కాన్వాయ్‌కు అడ్డువచ్చిన గ్రామస్థులను పోలీసులు తప్పించి అర్వింద్ కాన్వాయ్‌ను ముందుకు పంపించారు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు.. కాన్వాయ్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో రెండు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.
ఇవీ చదవండి:
Last Updated : Jul 15, 2022, 3:17 PM IST