కొవిడ్ సమయంలో ప్రాణవాయువుకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకూడదన్న ఉద్దేశంతో కరీనంగర్ జిల్లా కేంద్రాల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకుల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ తర్వాత మొట్టమొదటి సారిగా 21వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకును కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. కేవలం కొవిడ్ బాధితులకే కాకుండా ఇతర అత్యవసర సమయాల్లోను ఇక ముందు ఆక్సిజన్ కొరత ఉండబోదని మంత్రి పేర్కొన్నారు.
ప్రాణవాయువుకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకూడదు: గంగుల
కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో 21వేల లీటర్ల సామర్థ్యం గల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్‌ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. కేవలం కొవిడ్ బాధితులకే కాకుండా ఇతర అత్యవసర సమయాల్లోను ఇక ముందు ఆక్సిజన్ కొరత ఉండబోదని మంత్రి భరోసా ఇచ్చారు.
కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో 21వేల లీటర్ల సామర్థ్యం గల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్‌ను మంత్రి గంగుల కమలాకర్
గతంలో అనేక పర్యాయాలు ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయని.. ఇక నుంచి నిరంతరాయంగా ఆక్సిజన్ అందించగలుగుతామని గంగుల హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో కొవిడ్‌కు సంబంధించి 350 పడకలు అందుబాటులో ఉండగా రాబోయే 20 ఏళ్ల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని లిక్విడ్ సిలిండర్‌ను ఏర్పాటు చేశామని మంతి గంగుల కమలాకర్ వివరించారు.