కరీంనగర్ జిల్లాలో రెండో విడత టీకా కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. వేలాది మంది రెండో డోసు తీసుకోవాల్సి ఉండగా.. ఒక్కో కేంద్రంలో కేవలం 100 మందికి మాత్రమే టీకా ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో కాకుండా ఆన్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకొని టీకాలు ఇవ్వడంతో ప్రజలు పోటీ పడుతున్నారు.
రెండో విడత టీకా కోసం ప్రజల బారులు
రెండో విడత టీకా కోసం కరీంనగర్ జిల్లాలో ప్రజలు బారులు తీరుతున్నారు. వైద్య సిబ్బంది తమకు సంబంధించిన వారికే టీకాలు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కరోనా వ్యాక్సిన్, కరోనా టీకా, కరీంనగర్
ఇప్పటికే రెండో డోసు తీసుకోవాల్సిన గడువు ముగిసిపోతున్న దృష్ట్యా ఆందోళన నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలి విడత టీకా కోసం వచ్చినప్పుడు క్యూ ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ సవ్యంగా జరిగిందని ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదని పేర్కొంటున్నారు. వైద్య సిబ్బంది తమకు సంబంధించిన వారికే టీకాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
- ఇదీ చదవండి:'హ్యాపీ హైపోక్సియా'ను ఎలా గుర్తించాలి?