పెళ్లికి రాకపోయిన పర్వాలేదు..కానీ చావుకు మాత్రం తప్పకుండా వెళ్లాలంటారు పెద్దలు. కానీ పెద్దపల్లి జిల్లాలో మాత్రం చావు కబురు పంపితే కరోనా భయంతో చివరి చూపునకు కూడా రాలేకపోయారు బంధువులు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారానికి చెందిన కొసరి రాజవ్వ గురువారం అనారోగ్యంతో మృతి చెందింది. ఆమెకు పిల్లలు లేరు. భర్త రెండు నెలల క్రితం కన్నుమూశాడు. రాజవ్వ మృతి విషయాన్ని సమీప బంధువులకు తెలిపారు గ్రామ పెద్దలు.
కరోనా భయం.. కాటికి మోసుకెళ్లేటోళ్లు లేరు - karimnager latest news
కరోనా ప్రపంచ వ్యాప్తంగా మృత్య ఘంటికలు మోగిస్తోంది. శవాలను తీసుకెళ్లడానికి ఇటలీలో ఎవరు ముందుకు రావడం లేదు. పెద్దపల్లి జిల్లాకు చెందిన కొసరి రాజవ్వకు మాత్రం ఈ దయనీయ స్థితి తప్పలేదు. కన్నుమూశాక కాటికి తీసుకెళ్లే వారే కరువయ్యారు.
కరోనా భయం.. కాటికి మోసుకెళ్లేటోళ్లు లేరు
కరోనా భయంతో బంధువులు అంత్యక్రియలకు వచ్చేందుకు నిరాకరించారు. ఆస్తులు వద్దన్నారు. చేసేది లేక గ్రామ పంచాయతీ సభ్యులే అన్ని కార్యక్రమాలు చూసుకున్నారు. మృతదేహాన్ని పారిశుద్ధ్య సిబ్బంది రిక్షాలో శ్మశానానికి తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు.
ఇవీ చూడండి:కరోనా కేసుల్లో చైనాను మించిన అమెరికా
Last Updated : Mar 27, 2020, 12:50 PM IST