రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి కామారెడ్డి జిల్లా దేవునిపల్లి మండలం పొందుర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ కారు టైర్ పేలిపోవడం వల్ల అదుపుతప్పి ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యానును ఢీకొట్టింది. ప్రమాదంలో హైదరాబాద్‌కి చెందిన చంద్రశేఖర్రెడ్డి, విజయ దంపతులు మరణించారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరగడం వల్ల అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.