వెంకాయమ్మ ఇంటిపై దాడి... ఖండించిన తెదేపా YSRCP Followers Attack On Woman: తన ఇంటిపై వైకాపా నేతలు దాడి చేశారని ఓ దళిత మహిళ.. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు వచ్చి వాపోయింది. సోమవారం ఏపీ గుంటూరు కలెక్టరేట్‌కు వచ్చిన వెంకయమ్మ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దాంతో అగ్రహించిన వైకాపా నేతలు రాత్రి వెంకయమ్మపై దాడికి పాల్పడ్డారు.
'స్పందన కార్యక్రమంలో మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చాను. అందుకే వైకాపా నేతలు రాత్రి నా ఇంటికొచ్చి నాపై దాడి చేశారు.టీబీ వ్యాధితో బాధపడుతున్న నాపై కనికరం చూపలేదు. రాత్రి జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా'. - వెంకాయమ్మ, బాధితురాలు
వెంకయమ్మపై జరిగిన దాడిని తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు. వెంకాయమ్మను పరామర్శించి అన్ని విధాలా అండగా ఉంటామని.. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ తదితరులు ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను వెంకాయమ్మ వెల్లడిస్తే.. తనపై పథకం ప్రకారం దాడి చేశారని నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. వైకాపా పాలనలో దళితులు స్వేచ్ఛగా బతికే పరిస్థితులు లేవన్నారు. బడుగులను భయపెట్టి గొంతు నొక్కాలని చూస్తే వదిలిపెట్టమని మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ స్పష్టం చేశారు. వెంకాయమ్మ విషయంలో ఏం చేస్తారో మహిళా కమిషన్ సమాధానం చెప్పాలని తెదేపా అధికార ప్రతినిధి పిల్లిమాణిక్యరావు డిమాండ్ చేశారు.
ఇదీ జరిగింది:ఏపీగుంటూరు కలెక్టరేట్‌కు వచ్చిన ఓ మహిళ.. జగన్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తాడికొండ మండలం కంతేరుకు చెందిన కె.వెంకాయమ్మ.. భూ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు వెళ్లారు. భూమిని సర్వే చేసి ఎవరిది ఎంతవరకో తేల్చాలని స్పందన కార్యక్రమంలో అర్జీ అందజేశారు. అనంతరం ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పథకాలు పేదప్రజలకు మేలు చేసేలా లేవని వ్యాఖ్యానించారు. అన్నా క్యాంటీన్లు తీసేయటం, రంజాన్-క్రిస్మస్ కానుకల్ని ఎత్తేయటం సరికాదంటూ తనదైన రీతిలో చెబుతూ జగన్ మండిపడ్డారు.
ఇవీ చూడండి: