ఏపీకి చెందిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. వరుసగా 83వ రోజూ పలువురు అనుమానితులను ప్రశ్నిస్తోంది. వివేకా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ ఆనంద నాయక్‌ను సీబీఐ అధికారులు విచారించారు. పోస్టుమార్టం నివేదికను మరోసారి అధికారులు పరిశీలించారు.
- సునీల్ యాదవ్‌కు నార్కో పరీక్షలపై విచారణ వాయిదా..
వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్‌కు నార్కో అనాలసిస్ పరీక్షల అనుమతి కోసం సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై జమ్మలమడుగు కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. 45 నిమిషాల పాటు ఇరు పక్షాల న్యాయవాదులు ఆన్లైన్లో వాదనలు వినిపించారు. వాదనలు విన్న జమ్మలమడుగు మెజిస్ట్రేట్.. విచారణను వచ్చే నెల 1కి వాయిదా వేసింది.
- ఇది వరకే రివార్డు ప్రకటన..