తెలంగాణ

telangana

By

Published : Mar 21, 2022, 8:19 AM IST

Updated : Mar 21, 2022, 9:19 AM IST

ETV Bharat / city

Wooden Treadmill :చెక్క ట్రెడ్‌మిల్‌ రూపకర్త మండపేట వాసి

Wooden Treadmill : నేటి సమాజంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాయామశాల వైపు పరుగులు పెడుతున్నారు. కొందరు ఇంటి దగ్గరే ఉండి వ్యాయామం చేస్తే మరికొందరు యోగా కేెంద్రాలకు, వ్యాయామశాలకు వెళ్తున్నారు. అయితే వీటన్నింటికి డబ్బు అధికంగానే ఖర్చు అవుతోంది. కానీ ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వడ్రంగి కళాకారుడు మాత్రం భిన్నంగా చెక్కతో ట్రెడ్ మిల్ రూపొందించి అందరూ ఔరా అనేలా చేశాడు.

TEAK TREAD MILL
TEAK TREAD MILL

Wooden Treadmill : తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణానికి చెందిన వడ్రంగి కళాకారుడు కడిపు శ్రీనివాస్‌ చెక్కలతో ట్రెడ్‌ మిల్‌ (వ్యాయామ యంత్రం) రూపొందించి అబ్బురపరిచారు. దీని తయారీకి మూడు రోజుల సమయం పట్టిందని.. రోజు వారీ పని చేసుకుంటూ ముందుగా కావలసిన టేకు చెక్కలు సిద్ధం చేసుకుని రాత్రి సమయంలో దీని రూపొందించినట్లు శ్రీనివాస్‌ చెప్పారు. ట్రెడ్‌ మిల్లు తిరగడం కోసం 60 బాల్‌ బేరింగ్‌లు ఉపయోగించానని, మొత్తంగా దీని తయారీకి రూ.12వేలు ఖర్చయిందని తెలిపారు.

పరికరం పని తీరుపై వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టగా.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మెచ్చుకుని కళాకారుడిని గుర్తించి, సాయం చేయమని ట్వీట్‌ చేయడంతో ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తెలంగాణ మంత్రులు కొందరు ఫోను చేసి వివరాలు తెలుసుకున్నారని శ్రీనివాస్‌ ఆదివారం తెలిపారు.

Last Updated : Mar 21, 2022, 9:19 AM IST

ABOUT THE AUTHOR

...view details