ఏపీ విశాఖలో ఓ మహిళను వేధించిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగినిగా ఉన్నత స్థానంలో పని చేస్తున్న ఆ మహిళకు సొంత కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. వరసకు బావ అయిన వ్యక్తి... బాధిత మహిళను రహస్యంగా చిత్రీకరించాడు. బెదిరింపులకు దిగాడు. ఈ విషయాన్ని బాధితురాలు.. ఆ దుర్మార్గుడి భార్యకు తెలియజేసింది. అయినా ఫలితం లేకపోగా.. సమస్య మరింత తీవ్రమైంది. సదరు వేధింపుల వ్యక్తి భార్య.. ఆమె తమ్ముడు కూడా.. ఈ దారుణంలో భాగమయ్యారు. బాధితురాలిని తీవ్రంగా వేధించారు. 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే.. ఆ 'రహస్య చిత్రాలను' అంతర్జాలంలో పెడతామని భయభ్రాంతులకు గురిచేశారు. ఆఖరికి.. బాధిత మహిళ రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసినా వారు కనికరించలేదు. చివరికి.. విధిలేని పరిస్థితుల్లో.. బాధిత మహిళ.. స్పందన కార్యక్రమాన్ని సంప్రదించింది. తన సమస్యను శాంతిభద్రతల డీసీపీ రంగారెడ్డికి వివరించింది. వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ దుర్మార్గుడి ఇంట్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడ దొరికిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదులో నిజం ఉందని నిర్థరించుకున్నారు. 'రహస్య చిత్రీకరణ'లో భాగం పంచుకున్న ముగ్గురినీ కటకటాల్లోకి నెట్టారు. విదేశాల్లో ఉంటున్న మరో వ్యక్తి ప్రమేయమూ ఇందులో ఉన్నట్టు గుర్తించారు. బాధితురాలు ఉన్నత స్థాయిలో ఉండడం.. ఆర్థికంగా కాస్త మెరుగైన స్థితిలో ఉన్న కారణంగానే.. ఇలా హింసించారని పోలీసులు తెలిపారు.
రహస్యంగా 'చిత్రీకరించారు'.. వేధించారు.. 'స్పందన'తో చిక్కారు!!
ఆ దుర్మార్గుడు వరుసకు బావే. కానీ.. నరరూప రాక్షసుడిలా ప్రవర్తించాడు. ఆ మహిళను 'రహస్యంగా' చిత్రించాడు. డబ్బులు ఇస్తేనే ఆ 'వీడియో'లు డిలిట్ చేస్తానని వేధించాడు. ఆత్మహత్యాయత్నం చేసుకునేంతగా హింసించాడు. తన భార్య, బావమరిది సహాయాన్నీ ఈ వికృత చేష్టకు ఉపయోగించుకున్నాడు. అంతా కలిసి రాక్షసానందం పొందారు. ఈ వేధింపుల పర్వానికి.. ముగింపు ఎలా పడింది? బాధిత మహిళ ఎలా తనను తాను కాపాడుకుంది?
రహస్యంగా 'చిత్రించారు'.. వేధించారు.. 'స్పందన'తో చిక్కారు!!