గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ వివాహిత గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ బోయిన్పల్లి పీఎస్ పరిధిలోని ఓల్డ్ బోయిన్‌పల్లిలో చోటుచేసుకుంది. నల్గొండలో గవర్నమెంట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్, ఆయన భార్య శ్రీమతి(మహిళ పేరు) నాగిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే శ్రీమతి గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధి సమస్యతో బాధపడుతూ బాధ భరించలేక ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
బోయిన్‌పల్లిలో మహిళ ఆత్మహత్య - ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బోయిన్పల్లి పీఎస్ పరిధిలోని ఓల్డ్ బోయిన్‌పల్లిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
బోయిన్‌పల్లిలో మహిళ ఆత్మహత్య