హైదరాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో... పిల్లలతో కలిసి ఓ మహిళ అదృశ్యమైంది. మడ్‌ఫోర్డ్ వద్ద నివాసముంటున్న రేలావత్ సోమ్లాకు శాంతితో ఆరేళ్ల క్రితం పెళ్లైంది. మంగళవారం నాడు నీటి కుళాయి వద్ద తన సోదరి చిట్టితో గొడవ పడినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో మనస్థాపానికి గురైన శాంతి పిల్లల్ని తీసుకొని ఆటోలో జేబీఎస్ వైపు వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో... తన భార్య, పిల్లలు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
సోదరితో నీళ్ల గొడవ... వివాహిత అదృశ్యం - సోదరితో నీళ్ల గొడవ... వివాహిత అదృశ్యం
సోదరితో నీటి కుళాయి వద్ద గొడవైందని మనస్థాపంతో ఓ మహిళ పిల్లలతో కలిసి అదృశ్యమైన ఘటన... హైదరాబాద్‌లోని కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సోదరితో నీళ్ల గొడవ... వివాహిత అదృశ్యం