Women Discrimination : స్వాతంత్య్ర అమృతోత్సవాలు చేసుకుంటోన్న భారతావని విద్య, వైద్యం, ఐటీ, అంతరిక్షం.. ఇలా ప్రతి రంగంలోనూ గణనీయ పురోగతి సాధించింది. కానీ స్త్రీ, పురుష సమానత్వంలో మాత్రం వెనకబడే ఉందంటోంది అమెరికా సంస్థ ‘ప్యూ థింక్ ట్యాంక్’ సర్వే. మన దేశంలో 30 వేల మంది పాల్గొన్న ఆ సర్వే వివరాల్ని తాజాగా విడుదల చేశారు. అందులో వెల్లడైన విషయాలను చూస్తే మహిళల ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది..
భర్త మాట వినాలి..
Women's Day 2022 : సగటు భారతీయ కుటుంబాల్లో.. స్త్రీ, పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ చెప్పే విషయం ఏంటంటే... ‘మహిళలు భర్త మాట వినాలి’. 89 శాతం పురుషులు, 86 శాతం మహిళలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘పిల్లల బాధ్యత ప్రధానంగా మహిళలదే’ అన్న అంశానికి 24 శాతం మహిళలు, 35 శాతం పురుషులూ ఔనన్నారు.
ఉద్యోగం పురుష లక్షణమే..
Women's Day 2022 Story : ఉద్యోగాల కొరత ఉన్నపుడు మహిళలకంటే పురుషులకే అవకాశాలు ఇవ్వాలని మగవాళ్లతోపాటు ఆడవాళ్లూ అభిప్రాయపడ్డారు. సర్వేలో పాల్గొన్న వారిలో 82 శాతం పురుషులు, 77 శాతం మహిళలు ఈ మాటలు చెప్పారు.