తెలంగాణ

telangana

ETV Bharat / city

పింఛను కోసం పంచాయతీ కార్యదర్శిపై దాడి - panchayat secretary

పింఛను ఇవ్వడం లేదంటూ... ఆంధ్రప్రదేశ్​లో కుమారుడితో సహా వెళ్లి పంచాయతీ కార్యదర్శిపై ఓ మహిళ దాడి చేసింది. తనతో.. ఆ అధికారి అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పింఛను కోసం పంచాయతీ కార్యదర్శిపై దాడి

By

Published : Aug 11, 2019, 12:54 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా బెల్లంకొండ పంచాయతీ కార్యదర్శి దుర్గారావుపై.. ఓ మహిళ దాడి చేసింది. వితంతు పింఛను మొత్తాన్ని ఇంటికి తెచ్చి ఇవ్వాలంటూ కార్యదర్శిపై ఒత్తిడి తీసుకొచ్చింది. అలా కుదరదని... కార్యదర్శి చెప్పగా... కార్యాలయానికి కుమారుడితో కలిసి వెళ్లి దుర్గారావుపై దాడి చేసింది. ఈ మేరకు బెల్లంకొండ పోలీస్‌ స్టేషన్‌లో పంచాయతీ కార్యదర్శి దుర్గారావు ఫిర్యాదు చేశారు. మరోవైపు.. పింఛను కోసం వెళ్లిన తనతో... దుర్గారావే అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులకు సదరు మహిళ ఫిర్యాదు చేసింది.

పింఛను కోసం పంచాయతీ కార్యదర్శిపై దాడి

ABOUT THE AUTHOR

...view details