తెలంగాణ

telangana

ETV Bharat / city

Amaravathi: ఏపీ రాజధానిగా 'అమరావతి'ని కేంద్రం గుర్తించలేదా? - central government news

ఏపీకి కేంద్రం రాస్తున్న లేఖలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి(amaravathi)ని కేంద్రం గుర్తించడం లేదా? ఇప్పటికీ ఏపీకి హైదరాబాదే రాజధాని అని భావిస్తోందా? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులకు కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి ఇటీవల వస్తున్న లేఖల్లో ‘ఏపీ సెక్రటేరియేట్‌, హైదరాబాద్‌’ అనే రాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం అమరావతిలో ఉందన్న విషయం తెలియకుండా... ఇంత నిర్లక్ష్యంగా లేఖలు ఎలా రాస్తున్నారో అర్థం కావడం లేదని ఏపీ అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

whether-the-center-of-amravati-is-recognized-as-the-capital-of-ap
ఏపీ రాజధానిగా 'అమరావతి'ని కేంద్రం గుర్తించలేదా?

By

Published : Jul 11, 2021, 12:13 PM IST

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి(amaravathi)ని కేంద్రం గుర్తించడం లేదా? ఇప్పటికీ ఏపీకి హైదరాబాదే రాజధాని అని భావిస్తోందా? వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు.. ఏపీకి రాస్తున్న లేఖలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఏపీ ప్రధాన కార్యదర్శితో పాటు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులకు కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి ఇటీవల వస్తున్న లేఖల్లో ‘ఏపీ సెక్రటేరియేట్‌, హైదరాబాద్‌’ అని రాస్తున్నారు. ఎవరో ఒకరు రాస్తే ఏదో పొరపాటు అనుకోవచ్చు.

కానీ.. అదే తప్పు ఎక్కువ శాఖలు చేస్తుంటే దాన్ని పొరపాటు అనుకోవాలా? ఆంధ్రప్రదేశ్ అంటే చిన్న చూపు అనుకోవాలా? రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లయింది. అమరావతి నుంచి ఆంధ్రప్రదేశ్ పాలను మొదలై అయిదున్నరేళ్లు దాటింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు అమరావతి చిరునామాతోనే జరుగుతున్నాయి. కానీ కేంద్రం నుంచి మాత్రం హైదరాబాద్ చిరునామాతో లేఖలు వస్తున్నాయి.

కరోనా వైరస్‌ డెల్టాప్లస్‌ వేరియంట్‌పై అప్రమత్తం చేస్తూ జూన్‌ 25న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ రాసిన లేఖలో.. ఆదిత్యనాథ్‌దాస్‌ కార్యాలయం చిరునామా హైదరాబాద్‌ అని రాశారు. ఆంధ్రప్రదేశ్​కు బహిరంగ మార్కెట్ రుణ పరిమితిలో కోత పెడుతూ, జూన్ 30న కేంద్ర ఆర్థిక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్ అగర్వాల్ నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్​కు ఇచ్చిన లేఖలోనూ హైదరాబాద్ అనే రాశారు. ఆ లేఖలో చిరునామా...'ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థికశాఖ, సెకండ్ ఫ్లోర్,నార్త్ హెచ్ బ్లాక్, ఏపీ సెక్రటేరియట్, హైదరాబాద్-500022' అని రాశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం అమరావతిలో ఉందన్న విషయం తెలియకుండా,ఇంత నిర్లక్ష్యంగా లేఖలు ఎలా రాస్తున్నారో అర్థంకావడం లేదని ఏపీ అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details