తెలంగాణ

telangana

ETV Bharat / city

'మణికొండలో మంచినీటి సమస్య తీరుస్తాం' - We will solve water problem in Manikonda

మణికొండ పురపాలిక పరిధిలో మంచినీటి సమస్యను త్వరలో తీరుస్తామని ఛైర్​పర్సన్​ నరేందర్ తెలిపారు. మున్సిపల్​ ఛైర్​పర్సన్​గా కస్తూరి నరేందర్​, డిప్యూటీ ఛైర్మన్​గా కొండకల నరేందర్​రెడ్డిలు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

Manikonda_Muncipal
Manikonda_Muncipal

By

Published : Jan 31, 2020, 10:05 PM IST

హైదరాబాద్ నగర శివారు మణికొండ మున్సిపాలిటీ అభివృద్ధికి అధికారులతో చర్చించి ప్రణాళికలు సిద్ధం చేస్తామని పురపాలిక ఛైర్మన్ కస్తూరి నరేందర్​ చెప్పారు. ఛైర్​పర్సన్​గా కస్తూరి నరేందర్​, డిప్యూటీ ఛైర్మన్​గా కొండకల నరేందర్​రెడ్డిలు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మున్సిపాలిటీలో మంచినీటి సమస్య పరిష్కరిస్తామని... తమకు మణికొండ అభివృద్ధి ముఖ్యమని... అన్ని పార్టీలతో కలసిమెలసి పనిచేస్తామని ఛైర్మన్​ వివరించారు.

మణికొండ మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులుండగా... 8 స్థానాల్లో కాంగ్రెస్, 6 చోట్ల భాజపా గెలిచింది. ఈ రెండు పార్టీలు ఛైర్​పర్సన్​, వైస్ ఛైర్మన్ పదవులను పంచుకున్నాయి.

బాధ్యతలు స్వీకరించిన మణికొండ మున్సిపల్​ ఛైర్మన్​, వైస్​ఛైర్మన్​

ఇదీ చూడండి:నిర్భయ దోషులకు ఉరి శిక్ష మళ్లీ వాయిదా

ABOUT THE AUTHOR

...view details