తెలంగాణ

telangana

ETV Bharat / city

శ్రీశైలం జలాశయంలో పెరుగుతున్న నీటిమట్టం.. ప్రస్తుతం ఎంతంటే..!

srisailam update: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. ప్రాజెక్టు నీటి సామర్ధ్యం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 859.60 అడుగులకు చేరింది. జలాశయంలో 104.64 టీఎంసీల నిల్వ ఉన్నాయి.

srisailam
srisailam

By

Published : Jul 17, 2022, 5:19 PM IST

srisailam update: శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి.. వారం రోజులుగా వస్తున్న వరదతో జలాశయం నిండుకుండలా మారుతోంది. జూరాల, సుంకేసుల నుంచి 3లక్షల 3వేల 779 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వస్తుంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 859.60 అడుగులు, జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుత 104.64 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 31,784 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details