తెలంగాణ

telangana

ETV Bharat / city

'వక్ఫ్​బోర్డు ఆస్తులను కబ్జా చేసేవారిపై క్రిమినల్ కేసులు' - waqf board lands

హైదరాబాద్ నాంపల్లిలోని హజ్​హౌస్​లో బోర్డు సభ్యులతో వక్ఫ్​బోర్డు ఛైర్మన్​ మహమ్మద్​ సలీం సమావేశం నిర్వహించారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కబ్జా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు.

waqf board chairmen meeting on lands
waqf board chairmen meeting on lands

By

Published : Oct 13, 2020, 11:36 PM IST

వక్ఫ్ బోర్డు ఆస్తులను కబ్జా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని బోర్డు ఛైర్మన్ మహమ్మద్ సలీం తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కొన్ని చోట్ల వక్ఫ్ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు గుర్తించామన్నారు. వాటి రిజిస్ట్రేషన్లు రద్దు చేసి తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై హైదరాబాద్ నాంపల్లిలోని హజ్​హౌస్​లో బోర్డు సభ్యులతో ఛైర్మన్ సమావేశం నిర్వహించారు.

వక్ఫ్ ఆస్తులు తక్కువ ధరకు లీజుకు తీసుకొని చలామణి అవుతున్నారని... ప్రస్తుత మార్కెట్ ధర మేరకు లీజ్ కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న మజీద్​లను ఆధునికీకరిస్తామని... పబ్లిక్​గార్డెన్​లో ఉన్న మజీద్​ను నూతన హంగులతో పునర్​నిర్మించి హైదరాబాద్​లోనే నంబర్ వన్ మజీద్​గా తీర్చిదిద్దుతామన్నారు. మజీద్​ల నిర్వహణ కోసం ముత్తవల్లిలను, పెండింగ్​లో ఉన్న లీజ్ అమౌంట్​లను వసూళ్లు చేసేందుకు కలెక్షన్ ఇన్స్​పెక్టర్లను నియమిస్తున్నట్లు సలీం స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details