ఏపీ మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో 23వ రోజున అధికారులు పలువురిని విచారిస్తున్నారు. ఇవాళ సీబీఐ విచారణకు ఇద్దరు అనుమానితులు హాజరయ్యారు. పులివెందులకు చెందిన ఉమామహేశ్వర్‌తో పాటు సింహాద్రిపురం మండలం సుంకేశులకు చెందిన జగదీశ్వర్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గతంలో వివేకా పొలం పనులను చూసుకునేవారు. వారం క్రితమే జగదీశ్వర్‌ను సీబీఐ అధికారులు 3 రోజుల పాటు విచారించారు.
YS VIVEKA MURDER CASE: ఇద్దరు అనుమానితులను ప్రశ్నిస్తున్న సీబీఐ - మాజీ మంత్రి వివేకా హత్యకేసు వార్తలు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 23వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఏపీలోని కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో విచారణకు హాజరైన ఇద్దరు అనుమానితులను... అధికారులు ప్రశ్నిస్తున్నారు.
YS VIVEKA MURDER CASE
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డితో పాటు కారు మాజీ డ్రైవర్ దస్తగిరి, కంప్యూటర్ ఆపరేటర్ ఇదయతుల్లా, ఆయనకు సన్నిహితంగా ఉండే కిరణ్‌కుమార్ యాదవ్, సునీల్‌కుమార్ యాదవ్‌లతో పాటు మరికొందరిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
23 రోజులుగా నిరంతరాయంగా విచారణ కొనసాగిస్తున్న సీబీఐ అధికారులు.. ఘటనపై పూర్తి వివరాలు తేల్చే దిశగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనుమానితులను ప్రశ్నించి కీలక వివరాలను రాబట్టారు.