రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. వైరస్ నుంచి ప్రాణరక్షణ పొందేందుకు రోగనిరోధక శక్తి పెంచుకోవటమే ప్రత్యామ్నాయ మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్ సీ, విటమిన్ డీ, జింక్ ఔషధాలు వినియోగించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
విటమిన్ సీ, డీ ఔషధాలకు విపరీతమైన డిమాండ్ పెరిగిందని ఔషధ దుకాణదారులు అంటున్నారు. గతంలో రోజుకు 10 మంది వీటి కోసం వచ్చే వాళ్లు ఇప్పుడు 100 మందిలో 60 మంది విటమిన్ సీ, డీ, జింక్ ఔషధాలను కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. గతంలో 50 పల్స్ ఆక్సీమీటర్లు విక్రయించిన తమ దుకాణంలో 500 విక్రయిస్తున్నామని యజమానులు తెలిపారు.