తెలంగాణ

telangana

ETV Bharat / city

డా. సుధాకర్ వ్యవహారంపై సీబీఐకి లేఖ రాస్తాం: ఆర్కే మీనా

ఆంధ్రప్రదేశ్​ వైద్యుడు సుధాకర్ స్థానిక పోలీసు స్టేషన్​కు రావటంపై విశాఖ సీపీ ఆర్కే మీనా అసహనం వ్యక్తం చేశారు. సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబీఐకి అప్పగించామన్నారు. కేసుతో పోలీసులకు ఎటువంటి సంబంధంలేదన్నారు. విచారణ మొత్తం సీబీఐ చేస్తుందన్నారు. అయినా కొందరు రాజకీయ నేతలతో కలిసి డా.సుధాకర్ పోలీసు స్టేషన్​ రావటంపై ఆర్కే మీనా అభ్యంతరం తెలిపారు. ఈ వ్యవహారంపై సీబీఐకి లేఖ రాస్తామన్నారు.

visakha-cp-rk-meena-objects-dr-sudhar-visit-police-station
డా.సుధాకర్ వ్యవహారంపై సీబీఐకి లేఖ రాస్తాం: ఆర్కే మీనా

By

Published : Jun 11, 2020, 5:37 PM IST

ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు ఆదేశాలతో వైద్యుడు సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించామని విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు సీబీఐకి అందించామన్నారు. డాక్టర్​ సుధాకర్​ కేసులో పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టడంలేదని స్పష్టం చేశారు. అయినా డా.సుధాకర్​ స్థానిక పోలీసు స్టేషన్​కి రావటంపై ఆర్కే మీనా అసహనం వ్యక్తం చేశారు.

రాజకీయ నేతల ప్రోద్బలం..

ఈ అంశంపై సీబీఐకి లేఖ రాస్తామని మీనా చెప్పారు. కేసు సీబీఐ పరిధిలో ఉండగా ఎటువంటి సామాన్లు ఇవ్వలేమన్నారు. రాజకీయ నేతల ప్రోద్బలంతో పోలీసు స్టేషన్​కి వచ్చి, స్టేషన్​ ముందు ప్రసార మాధ్యమాలతో మాట్లాడడం సరికాదన్నారు.

ఇదీ చదవండి :ప్రేమ వివాహం చేసుకుందామని బయల్దేరారు... అంతలోనే...

ABOUT THE AUTHOR

...view details