ఏపీ కృష్ణా జిల్లా దేవరగుంట గ్రామానికి చెందిన డాక్టర్‌గా పేరు పొందిన తాళం వెంకటేశ్వరరావు, అతని కుమారుడిపై దాడి జరిగింది. వెంకటేశ్వరరావు రూ. 15 లక్షలు అప్పు తీసుకుని చెల్లించలేదని... అతనితోపాటు కుమారుడిని ఇంటి ముందున్న స్తంభానికి కట్టి దాడి చేశారు.
అప్పు తీర్చలేదని తండ్రీ కొడుకుని స్తంభానికి కట్టేసి కొట్టారు!
బకాయిపడ్డ అప్పు తీర్చలేదని తండ్రిని, తనయుడిని స్తంభానికి కట్టి దాడి చేసిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన ఏపీ కృష్ణా జిల్లా నూజివీడు మండలంలో దేవరగుంటలో చోటుచేసుకుంది.
అప్పు తీర్చలేదని తండ్రీ కొడుకుని స్తంభానికి కట్టేసి కొట్టారు!
ఈ విషయమై గతంలోనే గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా రూ. 20 లక్షలు చెల్లించాలని పెద్దలు తీర్పు ఇచ్చారు. వెంకటేశ్వరరావు అంగీకరించారని గ్రామస్థులు చెప్పారు. గడువు ముగిసినా బకాయి పడ్డ సొమ్ము చెల్లించక పోగా... సమాధానం చెప్పడం లేదని... గ్రామ కట్టుబాట్లు ధిక్కరించారని ఆరోపిస్తూ... కట్టేసి కొట్టినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు రాజీ కుదిర్చారని సమాచారం.
ఇదీ చదవండి:80ఏళ్ల వయసులో బామ్మ సేద్యం... కౌలు భూమిలో ప్రకృతి వ్యవసాయం