తెలంగాణ

telangana

ETV Bharat / city

venkaiah naidu: ప్రపంచంలో ఎక్కడున్నా మాతృభూమిని మరవరాదు: వెంకయ్యనాయుడు

Vice President venkaiah naidu: ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన రామినేని ఫౌండేషన్ గురు సన్మానం, ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. మొత్తం 280 మంది విద్యార్థులతో పాటు.. గుంటూరు జిల్లాకు చెందిన 32 మంది ఎంఈవోలకు అవార్డుల ప్రదానం చేశారు.

Vice President venkaiah naidu
ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

By

Published : Mar 1, 2022, 7:29 PM IST

Vice President venkaiah naidu: ప్రపంచంలో ఎక్కడున్నా మాతృభూమిని మరిచిపోకూడదని.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అప్పుడే మన ఎదుగుదలకు అర్థం ఉంటుందన్నారు. ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన రామినేని ఫౌండేషన్ గురు సన్మానం, ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.

విదేశాలకు వెళ్లిన మన ధర్మాన్ని, సంస్కృతిని మర్చిపోకుండా తమ జన్మభూమిని గుర్తు పెట్టుకుని సంపాందించిన దాన్ని ప్రజలతో పంచుకోవడాన్ని గుర్తించి వారు 22 సంవత్సరాలుగా ప్రతిభా పురస్కారాలు అందించడం చాలా అభినందనీయం. నేను ఎప్పుడూ చెబుతుంటాను. మాతృభూమిని, కన్నతల్లిని, మాతృభాషను మరిచిపోయిన వాడు మానవుడే కాదని. ప్రతిభను గుర్తించడం మన సంస్కారం. ప్రతిభను గుర్తిస్తే ఇతరులు కూడా స్ఫూర్తి పొంది మనం కూడా మంచిపనులు చేస్తే గుర్తిస్తారని ప్రోత్సాహం వస్తుందని ఆశిస్తారు. 'సొంతలాభం కొంతమానుకుని పొరుగువారికి తోడుపడవోయ్' అని మహాకవి గురజాడ అప్పారావు చెప్పారు. ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనం స్వర్గీయ రామినేని అయ్యన్న చౌదరి. వారి కుటుంబసభ్యులు ఆయన చూపిన మార్గంలో ప్రయాణించడం చాలా సంతోషకరం. - వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

2020-21 విద్యా సంవత్సరంలోపదో తరగతి పూర్తి చేసిన మొత్తం 280 మంది విద్యార్థులతో పాటు.. గుంటూరు జిల్లాకు చెందిన 32 మంది ఎంఈవోలకు అవార్డుల ప్రదానం చేశారు. ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్న రామినేని ఫౌండేషన్‌ను అభినందించారు.

ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఇదీ చదవండి:Venkaiahnaidu: నాయకులే ప్రజల మధ్య చీలికలు తీసుకురావడం బాధాకరం: వెంకయ్యనాయుడు

ABOUT THE AUTHOR

...view details