తెలంగాణ

telangana

ETV Bharat / city

గవర్నర్​ తమిళిసైను కలిసిన కాంగ్రెస్ నేత వీహెచ్ - గవర్నర్​ను కలిసిన కాంగ్రెస్​ సీనియర్ నేత వీహెచ్​

గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ను కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్​ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని పలు అంశాలను గవర్నర్​ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీ సమ్మెతోపాటు పలు అంశాలపై చేసిన వినతుల పట్ల గవర్నర్​ సానుకూలంగా స్పందించింనట్లు వీహెచ్​ తెలిపారు.

గవర్నర్​ను కలిసిన కాంగ్రెస్​ సీనియర్ నేత వీహెచ్​

By

Published : Oct 11, 2019, 5:51 PM IST

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కలిసి పలు అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీపావళి తర్వాత తన ఇంట్లో చేయనున్న సత్యనారాయణ స్వామి వ్రతానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేసినట్లు వీహెచ్​ తెలిపారు. హాజీపూర్‌ ఘటన గురించి గవర్నర్‌కు తెలియచేసిన ఆయన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తరఫు నుంచి హాజీపూర్ బాధితుల్ని పరామర్శించలేదని పేర్కొన్న వీహెచ్‌... అంబేడ్కర్‌ విగ్రహాన్ని పోలీస్‌ స్టేషన్‌లో ఉంచడం, ఇంటర్మీడియట్‌ విద్యార్థుల ఆత్మహత్యలు, ఆర్టీసీ సమ్మె తదితర అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీ సమ్మెతో ఇప్పటి వరకు నలుగురు ఉద్యోగులు చనిపోయారని... దీనికి బాధ్యత ఎవరు వహిస్తారన్నఆయన... కొత్త గవర్నర్‌ వచ్చాక తమకు న్యాయం జరుగుతుందని ఆశించినట్లు తెలిపారు. తాను చేసిన వినతుల పట్ల గవర్నర్‌ సౌందర్‌ రాజన్‌ సానుకూలంగా స్పందించారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details