తెలంగాణ

telangana

ETV Bharat / city

vaccine registration: ఇక నుంచి తపాల కార్యాలయాల్లోనూ వ్యాక్సిన్​ రిజిస్ట్రేషన్​ - తపాలా శాఖ

వ్యాక్సిన్​ రిజిస్ట్రేషన్​ కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు తపాలా శాఖ ముందుకొచ్చింది. స్థానిక తపాలా కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఇందు కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని... ఉచితంగా సేవలు వినియోగించుకోచ్చని చెప్పారు.

vaccine registration in post offices at rural villages in telangana
vaccine registration in post offices at rural villages in telangana

By

Published : May 30, 2021, 5:01 PM IST

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వ్యాక్సిన్ తీసుకోడానికి పడుతున్న ఇబ్బందులు తీర్చేందుకు తపాలా శాఖ ముందుకొచ్చింది. వ్యాక్సినేషన్​కు ముందస్తుగా చేసుకునే రిజిస్టేషన్ కోసం స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం లేనివారు స్థానిక తపాలా కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలంగాణ పోస్ట్‌మాస్టర్ జనరల్ వెంకట రామిరెడ్డి తెలిపారు.

తపాల సిబ్బంది తమ వద్ద ఉన్న బ్రాంచ్ ఆఫీస్ కామన్ సర్వీస్ సెంటర్ మెబైల్ ద్వారా కొవిన్ అప్లికేషన్​లో వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేస్తారని వెల్లడించారు. ఇందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని... ఉచితంగా సేవలు వినియోగించుకోచ్చని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 36 ప్రధాన తపాలా కార్యలయాలు, 643 ఉపతపాల కార్యాలయాలు, హైదరాబాద్​లోని 10 బ్రాంచ్ కార్యాలయల్లో ఈ సేవలు అమలులో ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:రాష్ట్ర కేబినెట్​ భేటీ.. లాక్‌డౌన్‌తో పాటు కీలక అంశాలపై చర్చ

ABOUT THE AUTHOR

...view details