రాష్ట్రవ్యాప్తంగా తొలిదశ వ్యాక్సినేషన్లో భాగంగా హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం ముగిసినట్టు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లో కలిపి సుమారు 3.3లక్షల మంది కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. అందులో కేవలం 1లక్షా 93వేల 485మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
అవకాశం లేదు:
కేవలం 58.3శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నట్టు స్పష్టం చేసింది. అయితే రిజిస్టర్ చేసుకున్న వారిలో కొందరు అనేక కారణాలతో వ్యాక్సిన్ తీసుకోలేదని.. అలాంటి వారికి మరోమారు అవకాశం కల్పించబోమని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.