జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని భాజపా మరింత వేడెక్కిస్తోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్... కూకట్‌పల్లి రోడ్ షోకు కమలం శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఉషా ముళ్లపూడి కమాన్ నుంచి అల్విన్ ప్రధాన కూడలి వరకు రోడ్ షో సాగనుంది. యోగి ఆదిత్యనాథ్‌కు భాజపా, జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికారు.
గ్రేటర్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రోడ్ షో - కూకట్‌పల్లిలో యోగి ఆదిత్యానాథ్ రోడ్‌షో
హైదరాబాద్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రోడ్ షో నిర్వహించారు. గ్రేటర్లో భాజపా అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ కూకట్‌పల్లిలో ప్రచారం చేశారు.
గ్రేటర్లో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ రోడ్ షో
బల్దియా ఎన్నికల్లో భాజపా విజయం కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం చేశారు. యోగి ఆదిత్యనాథ్‌తోపాటు రోడ్ షోలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, మురళీధర్‌రావు, జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి:తెరాస ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం: బండి