మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు శివారులో అలివేలమ్మ అనే మహిళ ఈ నెల 16న హత్యకు గురైంది. బాలనగర్ మండలం గుండేడ్‌కు చెందిన ఎరుకల శ్రీను ఈ హత్యచేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడితోపాటు హత్యతో సంబంధమున్న అతని భార్యను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు గతంలో ఇదే కోణంలో చాలా హత్యలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
16 మందిని
బూత్పూర్ మండలం కరివెన శివారులో బాలమ్మ అనే మహిళ, కొత్తకోట మండలం అప్పరాలలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. డిసెంబర్ 14న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో టీఎస్ఎండీసీ ఇసుక యార్డులో ఓ మహిళ ఎముకల గూడు దర్శనమిచ్చింది. ఈ ఇసుక కుప్పను మహబూబ్‌నగర్ జిల్లా నుంచి తీసుకొచ్చి డంప్ చేసినట్లుగా తేలింది. చివరకు దేవరకద్ర మండలం డోకూరులో జరిగిన మహిళ హత్య కేసు నిందితుడే ఈ నాలుగు హత్యలూ చేసినట్లు తేలింది.
శ్రీను - నేర సామ్రాజ్యం
- సొంత తమ్ముడు, అత్త సహా 13 హత్య కేసుల్లో ఎరుకల శ్రీను నిందితుడుగా ఉన్నాడు. మూడు కేసులు రుజువు కాగా మిగిలిన కేసులు దర్యాప్తులో ఉన్నాయి.
- గతంలో మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడు హత్యలు చేసినట్లుగా తెలుస్తోంది.
- షాద్‌నగర్, శంషాబాద్, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో నిందితుడు ఈ నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
- 2007లో తమ్ముడి హత్యకేసులో ఎరుకలి శ్రీను జైలుకెళ్లాడు. సత్ప్రవర్తన కింద అప్పీలు చేసుకొని శిక్షకాలానికి ముందే జైలు నుంచి బయటకు వచ్చాడు. బయటకి రాగానే మళ్లీ నేరాలు మొదలు పెట్టాడు.
- తాజాగా జరిగిన హత్యకేసుల్లో అతనిపై అనుమానం వచ్చిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
- మహిళల ఒంటిమీదున్న నగలే లక్ష్యంగా ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.