తెలంగాణ

telangana

ETV Bharat / city

జగన్ అసమర్థతతో ఏపీలో అరాచక పాలన: కేంద్రమంత్రి మురళీధరన్‌ - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

Union Minister Muraleedharan fires on AP cm jagan: వైకాపా సర్కార్​పై కేంద్రమంత్రి మురళీధరన్​.. తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో శాంతిభద్రతలు సన్నగిల్లాయని, ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతున్నాయనే అనుమానం కలుగుతోందన్నారు. భాజపా నేత శ్రీకాంత్‌ను చంపేందుకు ఆత్మకూరులో కుట్రపన్నారని ఆరోపించారు.

Union Minister Muraleedharan fires on AP cm jagan, union ministers on ap cm
జగన్ అసమర్థతతో ఏపీలో అరాచక పాలన: కేంద్రమంత్రి మురళీధరన్‌

By

Published : Jan 24, 2022, 3:47 PM IST

Union Minister Muraleedharan fires on AP cm jagan : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్‌రెడ్డి అవినీతి పాలనతో ఏపీ ప్రజలు విసిగిపోయారని.. కేంద్రమంత్రి మురళీధరన్‌ ధ్వజమెత్తారు. ఏపీలో శాంతిభద్రతలు సన్నగిల్లాయని, ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతున్నాయనే అనుమానం కలుగుతోందన్నారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీగా ఉన్న కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన భాజపా నేత శ్రీకాంత్‌రెడ్డిని... ఆ రాష్ట్ర పార్టీ నేతలతో కలిసి మురళీధరన్‌ పరామర్శించారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని వదిలేసి, అలాంటి వాటిని అడ్డుకోబోయిన శ్రీకాంత్‌రెడ్డిని అరెస్టు చేయడం దారుణమన్నారు.

జగన్ అసమర్థతతో ఏపీలో అరాచక పాలన: కేంద్రమంత్రి మురళీధరన్‌

"భాజపా నాయకుడు శ్రీకాంత్‌రెడ్డిపై కేసులు ఎత్తివేయాలి. శ్రీకాంత్‌ను చంపేందుకు ఆత్మకూరులో కుట్రపన్నారు. భాజపా నేతలను ఆత్మకూరుకు పంపాలి. అల్లర్లు జరిగిన రోజు నుంచి భాజపా నేతలను అక్కడికి పంపలేదు. జగన్ అసమర్థత వల్ల ఏపీలో అరాచక పాలన సాగుతోంది. పాలనపై సీఎం దృష్టి పెట్టకపోవడంతో వైకాపా నాయకులు రెచ్చిపోతున్నారు. అల్లర్లకు కొందరు ప్రోత్సహిస్తున్నారు.. సీఎం బాధ్యత వహించాలి"

ABOUT THE AUTHOR

...view details