రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, రుణాలపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ కవాడిగూడ సీజీఓ టవర్స్‌లో బ్యాంకర్స్, జీహెచ్ఎంసీ, వివిధ శాఖల అధికారులతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు.
తెలంగాణలో కేంద్ర పథకాల అమలు తీరుపై కిషన్ రెడ్డి సమీక్ష - కేంద్ర పథకాల అమలు తీరుపై కిషన్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్ కవాడిగూడ సీజీవో టవర్స్‌లో అధికారులు, బ్యాంకర్లతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, రుణాలపై చర్చిస్తున్నారు. వీధి వ్యాపారులకోసం కేంద్రం తీసుకువచ్చిన రుణ పథకం ఉద్దేశాన్ని వివరించారు.
kishan reddy
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, వీధి వ్యాపారులకు అందించే రుణాలపై చర్చించారు. వీధి వ్యాపారుల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు కేంద్రం రుణాలు అందిస్తోందని.. అధికారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.